కన్సల్టింగ్ సంస్థ ECA ఇంటర్నేషనల్.. ఈ టాప్ టెన్ కాస్ట్ లీ నగరాల లిస్ట్ తయారుచేసింది.
ఈ లిస్టులో న్యూయార్క్ టాప్‌లో ఉంది. అక్కడ ఒక రోజు 4 స్టార్ హోటల్ రూమ్, భోజనాలు, లాండ్రీ, టాక్సీ ట్రిప్స్, డ్రింక్స్ కోసం $796 (రూ.65811) ఖర్చవుతోంది.
$700 (రూ.57874) ఖర్చుతో న్యూయార్క్ తర్వాత 2వ స్థానంలో స్వి్ట్జర్లాండ్ లోని జెనీవా నిలిచింది. (image credit - unsplash)
ఈ లిస్టులో 3వ స్థానంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఉంది. ఇక్కడ ఒక రోజుకు $658 (రూ.54401)లు ఖర్చు అయిపోతున్నాయి. (image credit - unsplash)
4వ స్థానంలో మరో స్విట్జర్లాండ్ నగరం జ్యురిచ్ ఉంది. ఈ సిటీలో రోజుకు $641 (రూ.52996) అవుతోంది. (image credit - unsplash)
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో.. 5వ స్థానంలో నిలిచింది. ఇక్కడ రోజూ $609 (రూ.50,350)లు సమర్పించుకోవాలి. (image credit - unsplash)
ఇక ఇజ్రాయెల్ నగరం టెల్ అవివ్ 6వ స్థానంలో నిలిచింది. ఇక్కడ రోజూ $600 (రూ.49,606)లు జేబు లోంచీ ఎగిరిపోతాయి. (image credit - unsplash)
అమెరికా.. కాలిఫోర్నియాలోని లాస్ ఎంజిల్స్ 7వ స్థానంలో నిలిచింది. ఇక్కడ రోజూ $584 (రూ.48283)లు ఖర్చు చేయక తప్పదు. (image credit - unsplash)
ఈ లిస్టులో 8వ స్థానంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ చేరింది. అక్కడ $583 (రూ.48,200)లు రోజూ ఖర్చవుతాయి. (image credit - unsplash)
మధ్య ఆఫ్రికా దేశం అంగోలా రాజధాని లువాండా 9వ స్థానంలో చేరింది. అక్కడ రోజూ $565 (రూ.46712) సమర్పించుకోవాలి. (image credit - unsplash)
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్.. 10వ స్థానంలో చేరింది. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో రోజూ $557 (రూ.46,051) ఖర్చవుతోంది. (image credit - unsplash)