ఈ చిలుక పేరు కియా (The kea).
ఇది న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపిస్తుంది.
దక్షిణ దీవిలోని ఆల్పైన్, అటవీ ప్రాంతంలో ఉంటుంది.
ఈ రామచిలుకలు పెద్దవే. 48 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి.
ఆలివ్ గ్రీన్ కలర్ ఉండే వీటి రెక్కల్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది.
ఇవి ఎగిరినప్పుడు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇవి శాఖాహారంతోపాటూ మాంసాహారం కూడా తింటాయి.
ఒకప్పుడు ఇవి గొర్రెలపై దాడి చేస్తున్నాయని వీటిని పెద్ద సంఖ్యలో చంపేశారు.
వన్య ప్రాణి రక్షణ చట్టంలో భాగంగా 1986 నుంచి ఈ పక్షులను రక్షిస్తున్నారు.
ఇవి నేలలో బొరియల్లో నివసిస్తాయి. చెట్ల వేర్ల కింద దాక్కుంటాయి.
తెలివైన ఈ పక్షులు.. పర్వతాల్లో విపరీత వాతావరణాన్ని తట్టుకుంటున్నాయి.
వీటికి లాజికల్ నాలెడ్జ్ ఎక్కువ. ఆహారం కోసం రకరకాల ప్లాన్స్ వేస్తాయి.
కష్టమైన పని పూర్తి చేసేందుకు ఈ పక్షులు గ్రూపుగా మారతాయి.
ఇలాంటి వైరుధ్యాలే వీటిని మిగతా చిలకల కంటే భిన్నంగా మార్చాయి.