Sea Cucumber : సీ కుకుంబెర్లు సముద్రంలో తిరిగే అకశేరుకాలు. ఇవి సముద్ర అడుగు భాగంలో పాకుతూ వెళ్తాయి. వీటి వేగం గంటకు 0.0048 కిలోమీటర్లు మాత్రమే.. అంటే 4.8 మీటర్లు.
Starfish : స్టార్‌ఫిష్‌లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. ఇవి ట్యూబ్ లాంటి చిన్న కాళ్లతో.. సముద్రగర్భంలో నడుస్తాయి. ఇవి గంటకు 0.048 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి.. అంటే 48 మీటర్లు.
Garden Snail : నత్తనడక అంటారు కదా.. నిజమే మరి.. నిదానంగా నడిచే వాటిగా నత్తలు గుర్తింపు పొందాయి. పెరట్లో తిరిగే నత్త గంటకు 0.048 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.. అంటే 48 మీటర్లు.
Sloth : నెమ్మదిగా నడిచే జంతువుల్లో స్లోత్‌లు ఫేమస్. ఇవి రోజులో ఎక్కువసేపు చెట్లకు వేలాడుతూ ఉంటాయి. గంటకు సగటున 0.24 కిలోమీటర్లు మాత్రమే కదులుతాయి.. అంటే 240 మీటర్లు.
Three-Toed Sloth : స్లోత్స్‌లో ఇవో రకం. ఇవి కూడా చాలా నెమ్మదిగా నడుస్తాయి. వీటి వేగం సాధారణంగా గంటకు 0.24 కిలోమీటర్లు మాత్రమే.. అంటే 240 మీటర్లు.
Giant Tortoise : భారీ తాబేళ్లు భూమిపై నెమ్మదిగా వెళ్లే ప్రాణుల లిస్టులో ఉన్నాయి. వీటి సగటు వేగం గంటకు 0.32 కిలోమీటర్లు లేదా.. 320 మీటర్లు మాత్రమే.
Giant Panda : జెయింట్ పాండాలు భూమిపై నెమ్మదిగా నడుస్తాయి. కానీ చెట్లు ఎక్కడంలో ఇవి వేగంగా ఉంటాయి. వీటిని నడక వేగం గంటకు 0.32 నుంచి 0.8 కిలోమీటర్లు (320 మీటర్ల నుంచి 800 మీటర్లు) మాత్రమే.
Loris : లోరిస్ అనేవి చిన్న జంతువులు. ఇవి కూడా చాలా నెమ్మదిగా నడుస్తాయి. వీటి వేగం గంటకు 0.8 కిలోమీటర్లు లేదా 800 మీటర్లు మాత్రమే.
Koala : కోలాలు చెట్లపై నివసిస్తాయి. రోజులో ఎక్కువ సేపు నిద్రపోతాయి. ఇవి కదిలినప్పుడు మాత్రం గంటకు 0.97 కిలోమీటర్ల లేదా 970 మీటర్ల వేగంతో వెళ్తాయి.
Manatee : మనాటీలను సముద్ర గోవులుగా చెబుతారు. ఇవి భారీ క్షీరదాలు. తీర ప్రాంత నీరు, నదుల్లో నెమ్మదిగా ఈదుతాయి. సాధారణంగా వీటి వేగం గంటకు 8 కిలోమీటర్లు.