హైదరాబాద్‌కి సుమారు 100 కిలోమీటర్లు, సిద్ధిపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగనాయక సాగర్ ఇప్పుడు పర్యాటకులతో కళకళలాడుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ రిజర్వాయర్‌ను నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.
చుట్టూ నీరు.. మధ్యలో చిన్న దీవిలా ఉండటం వల్ల దీన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
దీన్ని గమనించిన ప్రభుత్వం రంగనాయక సాగర్ని మరింతగా అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది.
ఈ జలాశయం దగ్గర రూ.125 కోట్ల అంచనా వ్యయంతో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆల్రెడీ టెండర్లు పిలిచింది.
టెండర్ల బిడ్ డౌన్లోడింగ్ సోమవారం మొదలవుతుంది. టెండర్ దక్కించుకున్న సంస్థ.. జలాశయంలో బోటింగ్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
పర్యాటకులకు సౌకర్యాలు, రిజర్వాయర్ వెంట గ్రీనరీని అభివృద్ధి చెయ్యాల్సి ఉంటుంది.
ఎంత ఎండ ఉన్నా.. ఈ రిజర్వాయర్ దగ్గరకు రాగానే గాలి బాగా వీస్తుంది. అందువల్ల ఇక్కడ పచ్చదనం పెరిగితే... పర్యాటకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
పర్యాటకులకు ఇక్కడే స్నాక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి కూడా లభించేలా చెయ్యాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
పర్యాటకుల వల్ల రిజర్వాయర్‌లో కాలుష్యం ఏర్పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మొత్తంగా విదేశీ పర్యాటకుల్ని సైతం ఆకర్షించేలా రంగనాయకసాగర్‌ను తీర్చి దిద్దాలని తెలంగాణ టూరిజం శాఖ నిర్ణయించుకుంది.