Air Conditioner: ఏసీలో టన్ను అంటే ఏమిటి..

మనం ఏసీ కొనడానికి వెళ్లినప్పుడు సేల్స్ మెన్ ముందుగా ఏసీ ఎన్ని టన్నులు ఉంటుందో చెబుతాడు. 

అది ఏసీ బరువు అనుకుంటే పొరపాటే. చాలా మందికి ఏసీలో టన్ను అంటే ఏమిటో తెలియదు.

సేల్స్‌మెన్ మిమ్మల్నీ ఎన్ని టన్నుల ఏసీ తీసుకుంటారని అడిగినప్పుడు.. అది టన్ను బరువున్న ఏసీ వస్తుందని అర్థం కాదు. 

ఏసీలో టన్ను అంటే అది ఇచ్చే చల్లదనమని అర్థం.

గది వెడల్పును బట్టి టన్నుల్లో విడదీస్తారు. మీ రూమ్ విస్తీర్ణం 10/10 ఉన్నట్లయితే 1 టన్ను ఏసీ సరిపోతుంది. 

అదే 100 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉంటే 1.5 టన్నుల ఏసీ తీసుకోవాలి. 

మీ గది 200 టన్నులకు మించి విస్తీర్ణం ఉంటే 3 టన్నుల ఏసీ తీసుకుంటే రూమ్ టెంపరేచర్ చల్లగా ఉంటుంది. 

విస్తీర్ణాన్ని బట్టి అంత టన్నుల ఏసీని కొనుగోలు చేస్తేనే బాగుంటుంది. 

దీని  ప్రకారం మీరు ఎక్కువ ధర వెచ్చించి ACలలో పెట్టుబడి పెట్టాలని దీని అర్థం కాదు. 

ఎందుకంటే దీని కోసం మీరు మీ గది పరిమాణాన్ని పరిగణించాలి. 

గది పరిమాణాన్ని బట్టి.. మీరు ఏసీలో ఎన్ని టన్నులు తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది.