తక్కువ ధరకే 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్స్.. ఈ 3 ఫోన్లపై రూ.37,000 డిస్కౌంట్

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా భారీ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. 

రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ 5జీ, ఇన్‌ఫినిక్స్ జీరో అల్ట్రా, మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌పై సూపర్ ఆఫర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 69,999గా ఉంది. 


అయితే దీన్ని మీరు ఇప్పుడు సేల్‌లో రూ. 54,999కే కొనొచ్చు. అంటే రూ. 15 వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ఏకంగా రూ. 21,400 వరకు ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 750 తగ్గింపు వస్తుంది. 

అంటే మీరు ఈ ఫోన్‌ను రూ. 32,800కు కొనొచ్చు. అంటే ఏకంగా రూ. 37,150 డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. 

ఇన్‌ఫినిక్స్ జీరో అల్ట్రా ఫోన్‌పై కూడా రూ. 33,750 డిస్కౌంట్ వస్తోంది. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 49,999గా ఉంది. అయితే దీన్ని రూ. 36,999కు కొనొచ్చు. 

బ్యాంక్ ఆఫర్ రూ. 750 వస్తుంది. అలాగే రూ.20 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుంది. అంటే ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 16,249కు కొనొచ్చు. 

ఇంకా రెడ్‌ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్‌పై కూడా సూపర్ ఆఫర్ ఉంది. రూ. 28,500 వరకు తగ్గింపు వస్తోంది. ఈ రెడ్‌మి ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 33,999గా ఉంది. 

అయితే దీన్ని రూ. 29,999కు కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 2500 వరకు తగ్గింపు వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 22 వేల వరకు ఉంది. ఈ ఆఫర్లు కలుపుకుంటే రూ. 5499కే ఈ ఫోన్ లభిస్తుంది.