ఫోన్ నీటిలో
పడిందా..
ఇలా చేయకండి!

telugu.news18.com

రోజుల్లో మనకు అన్నింటి కంటే ముఖ్యమైనది మొబైలే. తెల్లారింది మొదలు నిద్రపోయేవరకూ దానితోనే పని. 

ఐతే... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఒక్కోసారి మొబైల్ చేతిలోంచీ జారి... నీటిలో పడుతుంది. 

మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ప్రమాదవశాత్తు స్మార్ట్‌ఫోన్ నీటిలో పడే అవకాశం ఉంటుంది. 


దీంతో ఫోన్‌ని ఆరబెట్టడానికి కొందరు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. 

ఫోన్ నీటిలో ఈ పనులు అస్సలు చేయకూడదని మరీ మరీ చెబుతున్నారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

* ఫోన్ ఛార్జ్ చేయొద్దు.. : నీటిలో పడగానే ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫోన్‌ని స్విచ్ ఆన్ చేయడానికి ఛార్జింగ్ పెడుతుంటారు.

 ఇలా అస్సలు చేయకూడదు. డివైజ్‌లోకి నీరు వెళ్లినందున ఛార్జ్ చేయడం వల్ల షాక్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. 

* బియ్యంలో పెట్టొద్దు.. : బియ్యం గింజలకు తేమను గ్రహించే లక్షణం ఉంటుంది. కానీ డివైజ్‌ లోపలికి వెళ్లిన తేమను బియ్యం గింజలు పీల్చుకోలేవు. 

పైగా ఫోన్ పోర్ట్‌లలో బియ్యపు గింజలు ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆ పోర్ట్‌లను ఉపయోగించే వీలుండదు.

* బటన్స్‌ నొక్కవద్దు.. : ఫోన్‌ను నీటిలో నుంచి బయటికి తీశాక ఇష్టారీతిన బటన్స్‌పై ప్రెస్ చేయొద్దు. డివైజ్ ఫంక్షనాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది.

* వేడిలో పెట్టొద్దు.. : ఫోన్‌లోని తేమను ఆరబెట్టడానికి వేడి ప్రదేశంలో పెట్టాలని, బ్లోయర్ ద్వారా డ్రై చేయాలని చూడటం సరైంది కాదు. 

* షేక్ చేయొద్దు.. : ఫోన్‌ని అటూ ఇటూ కదపడం వల్ల లోపలి నీరు ఇతర పరికరాలు, సురక్షితమైన చోట్లకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్‌ని షేక్ చేయకపోవడం ఉత్తమం.

* 48 గంటలు వాడొద్దు.. : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే రోజు గడవదు. అయితే, నీటిలో పడిన తర్వాత ఫోన్‌ని కనీసం 48 గంటల పాటు ఉపయోగించకూడదు. స్మార్ట్‌ఫోన్‌ని ఆరనివ్వాలి. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి