పొగ మంచు వాటర్ ఎయిర్ కూలర్.. భలే ఉందిగా!

telugu.news18.com

One94Store బ్రాండ్‌తో ఇది లభిస్తోంది. ఇదో పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ఫ్యాన్. ఇది ఎయిర్ కూలర్ లాగా కూడా పనిచేస్తోంది.

ఈ ఫ్యాన్‌పై 500ml వాటర్ ట్యాంక్ ఇచ్చారు. పైన ఉన్న మూత తీసి.. నీరు పోసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఆ నీరు చిన్న కన్నాల నుంచి... పొగ మంచు లాగా వస్తుంది.

ఈ పొగమంచు వచ్చేందుకు 3 స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. పొగ మంచు వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌కి 3 రెక్కలు, 3 స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. 

ఈ ఫ్యాన్ కిందకూ, పైకీ 60 డిగ్రీస్‌లో తిప్పుకోవచ్చు. ఫ్యాన్ మధ్యలో పెర్ఫ్యూమ్ యాడ్ చేసుకునేందుకు వీలు ఉంది. 

ఈ ఫ్యాన్‌ని మొబైల్ USB కేబుల్ ద్వారా ఛార్జ్ చెయ్యవచ్చు. లేదా పవర్ బ్యాంక్, ల్యాప్ టాప్ USB పోర్ట్ ద్వారా కూడా ఛార్జ్ చెయ్యవచ్చు. 

ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే.. 1 పాయింట్ ద్వారా పొగమంచు (mist spray) వస్తూ ఉంటే.. ఈ ఫ్యాన్ 12 గంటలు పనిచేస్తుంది అని చెబుతున్నారు.

మీడియం లెవెల్లో 3 పాయింట్స్ ద్వారా పొగమంచు వస్తూ ఉంటే.. ఈ ఫ్యాన్ 4 గంటలు పనిచేస్తుంది అని చెబుతున్నారు.

హై లెవెల్లో 5 పాయింట్స్ ద్వారా పొగమంచు వస్తూ ఉంటే.. ఈ ఫ్యాన్ 2.5 గంటలు పనిచేస్తుంది అని చెబుతున్నారు.

ఈ ఫ్యాన్‌కి 7 రంగుల్లో లెడ్ లైట్స్ ఇచ్చారు. ఒక్కో రోజు ఒక్కో కలర్‌లో వెలిగించుకోవచ్చు.

ఈ ఫ్యాన్‌కి 3 టైమర్లు కూడా ఉన్నాయి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు మాత్రమే పనిచేసేలా టైమర్ పెట్టుకోవచ్చు. 

ఈ ఎయిర్ కూలర్ ఎత్తు 10 అంగుళాలు (25 సెంటీమీటర్లు) కాగా... వెడల్పు 7.9 అంగుళాలు (20 సెంటీమీటర్లు) అని తెలిపారు.

ఈ ఫ్యాన్‌ని వేలాడదీసుకునేందుకు పైన స్ట్రాప్ కూడా ఇచ్చారు. 

దీన్ని అమెజాన్‌లో అమ్ముతున్నారు. దీని ధర రూ.5,999 కాగా.. 67 శాతం డిస్కౌంట్‌తో 1,999కి అమ్ముతున్నట్లు తెలిపారు.

(All images credit - https://www.amazon.in/One94Store-Portable-Conditioner-Mini-Humidifier/dp/B0BXD5T2B3)

Watch This- పరీక్షలకు ఏ రాశి వారు ఎలా చదవాలి?