రూ.24,000 భారీ డిస్కౌంట్.. ఇలా చేస్తే రూ.4 వేలకే 5జీ ఫోన్

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. 

ఒప్పొ రెనో 7 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. 

ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 4 వేలు చెల్లిస్తే.. కొత్త 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 


ఒప్పొ రెనో 7 5జీ ఫోన్ రేటు ఎంఆర్‌పీ రూ. 37,990గా ఉంది. 

అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 28,999కు అందుబాటులో ఉంది. 

అంటే మీరు నేరుగానే 28 శాతం తగ్గింపు వస్తోంది. 256 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. 

అంతేకాకుండా ఈ ఫోన్‌పై మరో ఆఫర్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. 

ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఒప్పొ రెనో 7 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 24 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 

అంటే మీరు ఇంకో రూ. 4,750 చెల్లిస్తే.. కొత్త 5జీ ఫోన్ లభిస్తుంది.