ఓలా కంపెనీ మూడు రకాల మోడళ్లను అందిస్తోంది. వీటిల్లో ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1, ఓలా ఎస్ 1 ప్రో అనేవి ఉన్నాయి.
వీటి ధర వరుసగా రూ. 84,999, రూ. 1,09,999, రూ. 1,39,999గా ఉన్నాయి.
ఇప్పుడు మనం ఓలా ఎస్ 1 ఎయిర్ మోడల్‌ను తక్కువ ఈఎంఐలో ఎలా కొనాలో తెలుసుకుందాం.
ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ. 84,999గా ఉంది.
ఇప్పుడు మీరు కనీసం రూ. 10 వేలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే అప్పుడు మీరు 74,999కు లోన్ తీసుకోవచ్చు.
ఓలా ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, లిక్విలోన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఐసీఐసీఐలో వడ్డీ రేటు 11.26 నుంచి, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో 8.99 నుంచి, యాక్సిస్ బ్యాంక్‌లో 11.88 నుంచి, లిక్విలోన్స్‌లో 8.99 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతోంది.
ఇప్పుడు మీరు డౌన్ పేమెంట్ రూ. 15 వేలు చెల్లించారని అనుకుందాం. ఇప్పుడు మిగిలిన మొత్తానికి లోన్ తీసుకోవాలి.
8.99 శాతం వడ్డీ రేటు ప్రకారం లోన్ పొందితే.. అప్పుడు 48 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1982 ఈఎంఐ పడుతుంది.