జియో బంపరాఫర్.. ఈ ప్లాన్స్‌తో నెల రోజులు ఉచితంగా కాల్స్, డేటా

telugu.news18.com

రిలయన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త. 

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో తాజాగా కస్టమర్ల కోసం కొత్త రీచార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. 

కొత్త పోస్ట్‌ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్ ఆవిష్కరించింది.


జియో ప్లస్ పేరుతో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది.

రూ. 399 ప్లాన్ కింద నెలకు 75 జీబీ డేటా లభిస్తుంది. 

అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్ సర్వీసులు కూడా లభిస్తాయి. 

అదే రూ. 699 ప్లాన్ ఎంచుకుంటే వీరికి 100 జీబీ డేటా నెలకు వస్తుంది. 

అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులు పొందొచ్చు. ఇంకా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సర్వీసులు ఉచితంగా లభిస్తాయి.

ఈ ప్లాన్స్ కింద ఇంట్లో ముగ్గురికి యాడ్ ఆన్ కనెక్షన్ పొందొచ్చు. ఒక్కో సిమ్ యాక్టివేషన్‌కు రూ.99 కట్టాలి. నెల రోజుల కాల్స్ ,డేటా ఉచితంగా పొందొచ్చు.