వావ్.. ఇండియన్ సోలార్ పవర్ ఎలక్ట్రిక్ కారు

telugu.news18.com

ఈ కారు పేరు ఇవా ఎలక్ట్రిక్. ఈ కారు ఆరు కలర్స్‌లో లభిస్తోంది.

ఇది సోలార్ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ కారు. దీనికి ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఉంది.

సాధారణ సాకెట్‌తో ఈ కారును 4 గంటల్లో ఫుల్లుగా ఛార్జింగ్ చేయవచ్చు. CCS2 ద్వారా ఈ కారును 45 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే... 250 కిలోమీటర్లు వెళ్లిపోవచ్చు.

ఈ కారుకు ఏరోడైనమిక్స్ టెక్నాలజీ ఉంది. ఈ కారు ఇంటీరియర్ కొత్తగా ఉంది. దీనికి 2 సైడ్ డోర్స్ ఉన్నాయి.

ఇందులో ముగ్గురు కూర్చోవచ్చు. అన్ని సీట్లకూ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. డ్రైవర్‌కి ఎయిర్‌బ్యాగ్ ఉంది. డ్రైవర్ సీటును 6 రకాలుగా సరిచేసుకోవచ్చు.

ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ ప్లే కంపాటిబుల్ అవుతోంది. 

ఈ కారుకు పైన పనోరామిక్ సన్‌రూఫ్ ఉంది.

ఈ కారులో ట్రే, బ్యాగ్ హుక్, ఫోన్ స్టోరేజ్, డ్రైవర్ సీట్ దగ్గర అదనపు స్టోరేజ్ స్పేస్, డోర్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయి.

ఈ కారు 5 సెకండ్లలోనే 0 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

ఈ కారు ఇంజిన్ మాగ్జిమం 40Nm టార్క్ ఇస్తోంది. ఈ కారుకు సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు.

ఈ కారుకు డ్యూయల్ షాక్ సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉండగా.. వెనక డ్రమ్ బ్రేక్ ఉంది. ఈ కారు మినిమం టర్నింగ్ రేడియస్ 3.9mగా ఉంది.

ఈ కారు ధర ఎంత అన్నది ఇంకా కంపెనీ బయటపెట్టలేదు. దీని ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7 లక్షలు ఉండొచ్చనే అంచనా ఉంది. 

(All Images credit - https://www.evayve.com)

Watch This- బంగారానికి వాస్తు రూల్స్.. పాటిస్తే అదృష్టం