రూ.43 వేలకే అదిరే ఇ-బైక్.. రూ.1తో 10 కిలోమీటర్లు వెళ్లొచ్చు

telugu.news18.com

ఎసెల్ ఎనర్జీ అనే కంపెనీ పలు రకాల ఎలక్ట్రిక వెహికల్స్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. 

వీటిల్లో ఇబైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిల్లో గెట్ 7 అనే ఎలక్ట్రిక్ బైసైకిల్ గురించి తెలుసుకుందాం. 

దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అలాగే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ నడపడానికి లైసెన్స్ కూడా ఉండాల్సిన పని లేదు. 

 ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ధర విషయానికి వస్తే.. దీన్ని రూ. 43,500తో కొనుగోలు చేయొచ్చు.

కిలోమీటర్‌కు 10 పైసలు ఖర్చు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. 

అంటే ఒక్క రూపాయితో 10 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. 

ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌లో హారన్, ఇండికేటర్స్, రియర్ హెవీ డ్యూటీ షాకర్స్, ఫ్రంట్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఇంకా ఫ్రంట్ బాస్కెట్, హెడ్ లైట్, టెయిల్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. 

కాగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.