లైసెన్స్ అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఉండదు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మి వెళ్లొచ్చు

telugu.news18.com

జెమోపి రైడర్, జెమోపి మిసో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. 

జెమోపి రైడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. 

మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. క్విక్ చార్జ్ ఫీచర్ ఉంది. 2 గంటల్లోనే 80 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. 


ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేస్తే 90 నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంది. 

కిలోమీటర్ కేవలం 15 పైసలు ఖర్చు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. 

48వీ 26 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 70,850గా ఉంది. 48వీ 30 ఏహెచ్ వేరియంట్ రేటు రూ. 75,794గా ఉంది. అలాగే 48వీ 40 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 84,302గా ఉంది. 

అలాగే కంపెనీ మిసో అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా తయారు చేస్తోంది. 

ఇందులో 250 వాట్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.