బాహుబలి ఫోన్.. 22000mAh బ్యాటరీ, 108MP కెమెరా, 19GB ర్యామ్ ఫీచర్లు

telugu.news18.com

డూగీ వీ మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 

ఫోన్‌లో 22 వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని తెలుస్తోంది. ఔకిటెల్ డబ్ల్యూపీ19 ఫోన్‌లో 21 వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 

ఈ బ్యాటరీ చార్జింగ్‌కు 33 వాట్ సీ టైప్ చార్జర్ ఉంటుంది. 


బ్యాటరీ చార్జింగ్ 10 రోజుల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే ఒక్కసారి చార్జింగ్ పెడితే పది రోజుల వరకు ఈ ఫోన్‌ను ఉపయోగించొచ్చు. 

అలాగే ఫోన్ స్టాండ్ బై 64 రోజులు వస్తుందని తెలుస్తోంది. 

వీ మ్యాక్స్ ఫోన్‌లో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు ఉండొచ్చు. 

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సెల్ఫీ కెమెరాకు నాచ్ డిస్‌ప్లే ఉంది. 

ఇందులో వెనుక భాగంలో 108 ఎంపీ కెమెరా, 20 ఎంపీ, 16 ఎంపీ కెమెరాలు ఉండనున్నాయి. 

ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండనుంది.