బ్రిస్క్ ఈవీ అనే కంపెనీ తాజాగా హై రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.
ప్రస్తుతం ఈ కంపెనీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనేవి ఇవి.
బ్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 330 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
అంటే దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం.
ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇది కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. కంపెనీ ఇందులో 4.8 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్‌డ్ బ్యాటరీ, 2.1 కేడబ్ల్యూహెచ్ స్వాపబుల్ బ్యాటరీని అమర్చింది.
దీని రేటు రూ. 1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షల దాకా ఉండే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
అలాగే ఆరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. దీని రేంజ్ 175 కి.మి. అంటే ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఇది 175 కిలోమీటర్లు వెళ్లనుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దాదాపు రూ. 80 వేల దాకా ఉండొచ్చని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు.