ఎండాకాలంలో గాలితోపాటూ.. పొగ మంచును కూడా ఇస్తూ.. వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా ఈ మినీ ఎయిర్‌కూలర్ ఉంది.
ఇది భవానీ స్టోర్ బ్రాండ్‌తో లభిస్తోంది. ఇదో పోర్టబుల్ స్మాల్ ప్లాస్టిక్ ఎయిర్ కండీషనర్ ప్యూరిఫికేషన్ వాట్ కూలర్ అని తెలిపారు.
ఇది ఫ్యాన్ లాగా, ఎయిర్ కూలర్ లాగా పనిచేయగలదు. ఒకేసారి రెండు రకాలుగా వాడుకునే వీలుంది.
ఎక్కువ పొగ మంచు కావాలనుకుంటే... అందుకోసం ప్రెషర్ హ్యాండ్ ఉంది. దీన్ని పైకి లాగి కిందకు దింపినప్పుడు... ఎక్కువ పొగ మంచు వస్తుంది.
ఈ ఫ్యాన్ కింద ఓ వాటర్ ట్యాంక్ ఉంది. అందులో నీరు, ఐస్ ముక్కలు వేసుకోవచ్చు. ఫ్యాన్ కింద ఉన్న బటన్ ద్వారా... చల్లని నీరు.. పొగ మంచులాగా బయటకు వస్తుంది.
ఈ ఫ్యాన్ 2.5 వాట్స్ వాటేజ్ కలిగివుంది. దీనికి 3 రెక్కలున్నాయి. మూడు స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఎక్కువ గాలి కావాలనుకుంటే హై స్పీడ్ పెట్టుకోవచ్చు.
ఈ ఫ్యాన్‌కి ఛార్జింగ్ కోసం USB కేబుల్ ఇస్తున్నారు. మొబైల్ ఛార్జర్, ల్యాప్ టాప్, పవర్ బ్యాంక్ వంటి వాటితో దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఎయిర్ కూలర్ బరువు 350 గ్రాములు. క్యాంపింగ్, పిక్‌నిక్ వంటి వాటికి వెళ్లినప్పుడు ఈ ఫ్యాన్‌ని తీసుకెళ్లడం తేలిక అంటున్నారు.
ఈ ఫ్యాన్ సైజు గమనిస్తే... పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 11 సెంటీమీటర్లు ఉంటుందని తెలిపారు.
ఈ ఫ్యాన్ అసలు ధర రూ.1,599 కాగా... దీన్ని అమెజాన్‌లో 63 శాతం తగ్గింపుతో రూ.598కి ఇస్తున్నట్లు తెలిపారు.
All images credit - https://www.amazon.in/bhawani-store-Portable-Conditioner-Purification/dp/B092YMWWLB