బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1తో 10 కిలోమీటర్లు వెళ్లొచ్చు

telugu.news18.com

బ్యాటరీ ఎలక్ట్రిక్ అనే కంపెనీ మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు అందిస్తోంది.

వీటిల్లో మనం ఎల్‌వో ఈవీ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. 

బడ్జెట్ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. 


ఎల్‌వో ఈవీ అనేది ప్రీమియం ఆఫర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. 

దీని రేటు రూ. 68,900 నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా రూ. 1.02 లక్షల వరకు ధర ఉంది.   

ఈ స్కూటర్ ఐదు రకాల వేరియంట్ల రూపంలో లభిస్తోంది. బ్యాటరీ సామర్థ్యం ద్వారా వేరియంట్ మారుతుంది. 

ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 60 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వరకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. 

అంతేకాకుండా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే సమయంలో బ్యాటరీ రిప్లేస్‌మెంట్ కాస్ట్ తెలుసుకోవాలి. 

ఒకవేళ మీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పాడయితే అప్పుడు దాన్ని  మార్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ముందో  తెలుసుకోండి.