సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్.. దిమ్మతిరిగే ధర!

telugu.news18.com

జర్మనీకి చెందిన లగ్జరీ ఆటోమొబైల్ కంపెనీ ఆడీ (Audi).. ఎలక్ట్రిక్ మౌంటేన్ బైక్ తయారుచేసింది. 

ఆడీ కంపెనీ తమ ఉత్పత్తి అయిన RS Q ఇ-ట్రాన్ E2 ఎలక్ట్రిక్ దాకర్ ర్యాలీ రేసర్ ప్రేరణతో ఈ ఇ-బైక్ తయారుచేసింది.

చూడటానికి సైకిల్ లాగా కనిపించే ఈ బైక్‌కి 250W బ్రోస్ మోటర్ ఉంది. 720Wh బ్యాటరీ ఉంది. ఈ బైక్ 66ft/lb పీక్ టార్క్ ఇస్తోంది. 

ఈ ఎలక్ట్రిక్ మౌంటేన్ బైక్‌కి భారీ పవర్ ప్యాక్ ఉంది. ఈ బైక్‌ 48 నుంచి 152 కిలోమీటర్ల రేంజ్ కలిగివుంది.  టాప్ స్పీడ్ ఎంతో ఇంకా చెప్పలేదు.

ఈ ఎలక్ట్రిక్ బైక్... 4 డిఫరెంట్ ఎలక్ట్రిక్ స్పీడ్ మోడ్స్‌తో వచ్చింది. అవి మైల్డ్ ఎకో, స్పోర్ట్, టూర్, ఆల్ అవుట్ బూస్ట్ మోడ్. 

ఈ ఎలక్ట్రిక్ మౌంటేన్ బైక్‌ని అల్యూమినియంతో తయారుచేశారు. పోర్షే ఈ బైక్‌కి ఉండే కాంపొనెంట్స్ దీనికి కూడా ఉన్నాయి.

ఇటలీ సంస్థ ఫాంటిక్‌తో కలిసి ఆడి.. ఈ బైక్‌ని ఉత్పత్తి చేస్తోంది. ఈ బైక్ మూడు సైజుల్లో లభిస్తుంది.

ఈ బైక్‌కి IN.CA.S డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 7.1 అంగుళాల సస్పెన్షన్ ఉంది. 

ఈ బైక్‌ స్పెషల్ ఎడిషన్ ధర బ్రిటన్‌లో £8,499 (భారత్‌లో సుమారు ₹8,38,000) ఉంది. 

Watch This- భారత మొదటి సోలార్ పవర్ ఎలక్ట్రిక్ కారు