Airtel Offer: 3 నెలల పాటు ఉచిత అపోలో సబ్‌స్క్రిప్షన్

telugu.news18.com

ఎయిర్‌టెల్ భారతీయ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ఆఫర్‌లను ప్రకటించింది. 

కొత్త ఆఫర్ల ధర రూ. 489 మరియు రూ. 509గా నిర్ణయించారు. ఇవి వరుసగా 50GB మరియు 60GB డేటాను అందిస్తాయి. 

వాటి చెల్లుబాటు ఒక నెల. కొత్త రూ. 489 ఎయిర్‌టెల్ 30 రోజుల చెల్లుబాటు, అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్‌లను అందిస్తుంది. 

ఇది 50GB హై-స్పీడ్ డేటా మరియు 300 SMSలతో సహా ప్రయోజనాలతో కూడా వస్తుంది. 

ఎయిర్‌టెల్ రూ. 509 ఆఫర్ అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్స్, 60GB హై స్పీడ్ డేటా, 300 SMS, ఒక నెల వాలిడిటీని అందిస్తుంది. 

రెండు ఆఫర్‌లలో నిర్ణీత వినియోగం దాటిన తర్వాత.. ఒక్కో SMSకి రూ. 1, 1MB డేటా ఒక పైసాతో ఛార్జ్ చేయబడుతుంది. 

అంతే కాకుండా..  రెండు ఆఫర్‌లలో మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ వంటి Airtel Thangs ప్రయోజనాలు, ఫాస్ట్ ట్యాగ్ రూ. 100 క్యాష్‌బ్యాక్, ఉచిత హలోట్యూన్ మరియు వింక్ మ్యూజిక్ ఉన్నాయి. 

రెండు ఆఫర్‌లు Airtel Things యాప్ మరియు Airtel అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేయబడ్డాయి.