రూ.7,999కే 43 ఇంచుల స్మార్ట్‌టీవీ!

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మీరు తక్కువ ధరకే 43 ఇంచుల స్మార్ట్‌ టీవీని సొంతం చేసుకోవచ్చు. 

4కే స్మార్ట్ టీవీ 43 ఇంచుల సైజ్‌లో కొనాలంటే కనీసం రూ. 20 వేలు పెట్టుకోవాలి.

అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 43 ఇంచుల స్మార్ట్ టీవీని రూ. 26 వేల డిస్కౌంట్ ‌తో సొంతం చేసుకోవచ్చు. 


బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. థామ్సన్ 9ఆర్ ప్రో స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే ఆపర్లు అందుబాటులో ఉన్నాయి. 

థామ్సన్ 9ఆర్ ప్రో అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ టీవీ ధర రూ. 33,999గా ఉంది. 

అయితే డిస్కౌంట్ తర్వాత ఈ టీవీని రూ. 18,999కే కొనొచ్చు. 

సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ టీవీ కొంటే 10 శాతం తగ్గింపు వస్తుంది. 

ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ టీవీపై ఏకంగా రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. 

అంటే మీరు బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కలుపుకుంటే ఈ స్మార్ట్ టీవీని రూ. 7,999కే కొనొచ్చు.