క్రికెట్ లో వాడే
 బాల్ ధర ఎంతో తెలుసా?

telugu.news18.com

క్రికెట్ లో ఎక్కువగా అందరూ ప్లేయర్ల రికార్డుల గురించే మాట్లాడుకుంటారు.

అయితే వారు రికార్డులు సాధించడానికి అవసరమైన బ్యాట్, బాల్ ల గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు.

క్రికెట్ లో ప్లేయర్స్ ఆడే బ్యాట్ ధర సుమారుగా రూ. 20 నుంచి 30 వేల మధ్య ఉంటుంది.


ఇక గ్రేడ్ 1 బ్యాట్ లు అయితే రూ. 50 వేల వరకు ఉంటాయి.

ఇక క్రికెట్ లో వాడే బాల్స్ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

మార్కెట్లో క్రికెట్ బాల్ రూ. 150 నుంచి రూ. 1,000 వరకు ఉంటాయి.

అయితే అంతర్జాతీయ క్రికెట్ లో వాడే బాల్ ధర మాత్రం ఘాటెక్కించేలా ఉంటాయి.

అంతర్జాతీయ క్రికెట్ లో మూడు రకాల బాల్స్ ను ఉపయోగిస్తారు.

కూకబుర్రా, డ్యూక్, ఎస్జీ బంతులను అంతర్జాతీయ క్రికెట్ కోసం వాడతారు.

వీటి ధర సుమారు రూ. 12 వేల నుంచి 15 వేల వరకు ఉంటాయి.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి