ఆటగాళ్లను పట్టేసే
డెక్సా స్కాన్

telugu.news18.com

గత కొంత కాలంగా టీమిండియా ఆటగాళ్లు ఫిట్ నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఒక్క విరాట్ మినహా మిగిలిన ప్లేయర్లంతా ఏదో ఒక గాయం బారిన పడటం అలవాటుగా మారిపోయింది.

ప్రస్తుతం జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, సంజూ సామ్సన్ లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.


ఆటగాళ్ల ఫిట్ నెస్ సమస్యలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

కొత్తగా డెక్సా స్కాన్ ను ప్రవేశపెట్టింది.

ఇది ఒక ఎక్స్ రే లాంటి పరికరం. ఇందులో ఎక్స్ రే కంటే ఎక్కువ.. ఎమ్మారై స్కాన్ కంటే తక్కువ రేడియేషన్ తో ప్లేయర్ల ఎముకలను స్కాన్ చేస్తారు.

డెక్సా స్కాన్ ఎముకల్లో కాల్షియం, ఇతర మినరల్స్ ఎంత శాతం ఉన్నాయో గుర్తిస్తుంది.

దీనిని బట్టి ఎవరు గాయాల బారిన పడే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు.

ఈ స్కాన్ రిపోర్ట్ లను బట్టి ఒక్కో ప్లేయర్ ను ఒక్కో విధంగా ట్రయిన్ చేస్తూ వారిని గాయాల బారిన పడకుండా చూసే అవకాశం ఉంటుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి