కోహ్లీ.. రికార్డులను వేటాడే బెబ్బులి

telugu.news18.com

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు.

గతేడాది జరిగిన ఆసియా కప్ ముందు వరకు కూడా ఫామ్ తో ఇబ్బంది పడిన కోహ్లీ.. ప్రస్తుతం రెచ్చిపోతున్నాడు.

తన బ్యాట్ నుంచి పరుగుల వరదను పారిస్తున్నాడు.


ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 20 పరుగులు చేసిన కోహ్లీ.. అరుదైన మైల్ స్టోన్ ను అందుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో 25 వేల పరుగులు పూర్తి చేసిన 6వ ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు.

ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 547 ఇన్నింగ్స్ ల్లో 25,012 పరుగులు చేశాడు.

వేగంగా 25 వేల పరుగుల మార్కును అందుకున్న ప్లేయర్ గా కూడా కోహ్లీ నిలిచాడు.

ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

కుమార సంగక్కార (శ్రీలంక; 28,016 పరుగులు) రెండో స్థానంలో.. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా; 27,483 పరుగులు) మూడో స్థానంలో ఉన్నారు.

మహేల జయవర్దనే (శ్రీలంక; 25,957 పరుగులు), జాక్వస్ కలీస్ (సౌతాఫ్రికా; 25, 534 పరుగులు)లు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి