లంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో విరాట్ కోహ్లీ ( 87 బంతుల్లో 113 పరుగులు ; 12 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఈ సూపర్ సెంచరీతో పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ కోహ్లీ.
శ్రీలంకపై కోహ్లీకి ఇది తొమ్మిదో సెంచరీ. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టారు.
శ్రీలంకపై సచిన్ 8 సెంచరీలు చేశాడు. దాన్ని ఇప్పుడు అధిగమించాడు కింగ్ కోహ్లీ.
ఇక.. స్వదేశంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు కోహ్లీ.
సచిన్ భారత దేశంలో 20 సెంచరీలు బాదాడు. మొత్తం 164 మ్యాచుల్లో సచిన్ ఈ ఫీట్ సాధించాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ 102 మ్యాచుల్లోనే 20 హోం సెంచరీలతో సచిన్ రికార్డును సమం చేశాడు.
మరో ఐదు శతకాలు బాదితే 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ ను దాటిపోతాడు.
49 శతకాలతో, అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
45 సెంచరీలతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
అంటే మరో 5 సెంచరీలు చేస్తే కోహ్లీయే ప్రపంచ నంబర్ 1 శతకవీరుడిగా నిలుస్తాడు.