కోహ్లీ బ్యాట్ ధర
ఎంతో తెలుసా..?

telugu.news18.com

క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి విరాట్ కోహ్లి (Virat Kohli) బౌలర్ల భరతం పెడుతూనే ఉన్నాడు. 

అండర్‌ 19 నుంచి ప్రస్తుతం వరకు అతని బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతుంది. 

బౌలర్ల పాలిట విలన్ గా మారుతున్నాడు విరాట్ కోహ్లీ.

శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి రెండింట్లో అద్భుత సెంచరీలు చేశాడు. 

చివరి వన్డేలో అయితే.. పరుగుల విధ్వసం సృష్టించాడు. అతను 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కోహ్లి బ్యాట్ నుంచి వచ్చే ప్రతి సెంచరీ వెనుక అతని క్లాస్‌తో పాటు బ్యాట్ శక్తి కూడా ఉంటుంది. 

ఈ సూపర్ స్టార్ బ్యాట్ ఖరీదు గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఎంఆర్ఎఫ్ కంపెనీ తయారు చేసే ఈ బ్యాట్‌ను అత్యంత ఖరీదైన ఇంగ్లిష్ విల్లో అనే చెట్టు చెక్కతో తయారు చేశారట. 

దీన్ని ఆ కంపెనీ గోల్డ్ విజార్డ్ (బంగారు మాంత్రికుడు) అని పేరుపెట్టింది. ఈ బ్యాట్ కోసం ఇంగ్లీష్ విల్లో చెక్కల్ని 10 నుంచి 12 వరకు ఉపయోగిస్తారు.

విరాట్ కోహ్లీ బ్యాట్ బరువు 1.1 కేజీల నుంచి 1.26 కేజీల వరకు ఉంటుంది. ఇక.. ఈ బ్యాట్ రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి