ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించే లీగ్.
రెండు నెలల పాటు విధ్వంసకర ఆటతో అభిమానులను అలరించే సూపర్ డూపర్ లీగ్
ఇప్పటికే 15 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని 16వ సీజన్ కోసం రెడీ అవుతుంది.
ఏడుగురు కెప్టెన్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ ను నెగ్గారు.
ఇందులో రోహిత్ రికార్డు స్థాయిలో 5 సార్లు ఉండగా.. ధోని నాలుగు సార్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
గౌతం గంభీర్ రెండు సార్లు కోల్ కతా నైట్ రైడర్స్ ను చాంపియన్ గా నిలిపాడు.
గతేడాది గుజరాత్ టైటాన్స్ ను హార్దిక్ పాండ్యా విజేతగా నిలిపాడు.
వీరితో పాటు ముగ్గురు విదేశీ ప్లేయర్లు కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గారు.
షేన్ వార్న్ : 2008 (రాజస్తాన్ రాయల్స్)
గిల్ క్రిస్ట్ : 2009 (డెక్కన్ చార్జర్స్)
డేవిడ్ వార్నర్ : 2016 (సన్ రైజర్స్ హైదరాబాద్)