RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.
RRR సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ తో అటు రామ్ చరణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది.
మొన్నటి వరకు టాలీవుడ్ బడా హీరోలుగా ఉన్న వీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ హీరోస్ గా మారిపోయారు.
నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక జనవరి 18న హైదరాబాద్ వేదికగా భారత్, కివీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.
ఇందుకోసం భారత ప్లేయర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ తో సహా ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్ లు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.
RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు సూర్యకుమార్ యాదవ్ ఫిదా అయినట్లు సమాచారం.
అందుకే హైదరాబాద్ కు రాగానే జూనియర్ ఎన్టీఆర్ ను కలిశాడు.
ఇషాన్ కిషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగాడు.
శుబ్ మన్ గిల్ కూడా ఎన్టీఆర్ తో ఫోటో కోసం ఎగడబడ్డాడు.
యుజువేంద్ర చహల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ఫోటో దిగాడు.