గెలిచినా టీమిండియాకు బోలెడు సమస్యలు!

ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ గెలుచుకుంది. 

సూర్య, కోహ్లీ, హార్దిక్ మెరుపులతో టీమిండియా గట్టెక్కేసింది. సిరీస్ గెలిచినా టీమిండియాకు చాలా సమస్యలు ఉన్నాయి.

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మూడింట్లోనూ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ముఖ్యంగా భారత జట్టును అత్యంత కలవర పెడుతున్న అంశం.. డెత్‌ బౌలింగ్‌. 

మ్యాచ్‌ల ఫలితాలు తేలే ఈ ఓవర్లలో.. భారత బౌలర్ల ప్రదర్శన రోజు రోజుకూ ఆందోళన పెంచుతోంది.

ఆసియా కప్‌లో ఫైనల్‌ చేరకుండానే నిష్క్రమించడానికి.. పాకిస్థాన్‌, శ్రీలంక జట్ల చేతుల్లో పరాజయం పాలవడానికి చివరి ఓవర్లలో చెత్త బౌలింగే కారణం. 

ఆస్ట్రేలియా సిరీస్ తో జట్టులోకి వచ్చిన బుమ్రా, హర్షల్ తిరిగి రాణించేందుకు సమయం పట్టేలా ఉంది. 

ఇక, భువీ, అవేశ్ ఖాన్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

ఫీల్డింగ్ లోనూ టీమిండియా తడబడుతోంది. అక్షర్, కేఎల్ రాహుల్, రోహిత్ లాంటి స్టార్ ఫీల్డర్లు కూడా క్యాచ్ లు మిస్ చేశారు.

ఆసియా కప్ లో సూపర్ -4 స్టేజీలో పాక్ మీద ఓడిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. కీలక సమయంలో అర్షదీప్ సింగ్ క్యాచ్ చేజార్చడమే టీమిండియాను ఓటమి బాట పట్టేలా చేసింది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి