టీమిండియ జోరు.. ఆసీస్ బేజారు

telugu.news18.com

టీమిండియా ఖాతాలో మరో రికార్డు చేరింది.

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 ద్వారా భారత్ ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది.

2009లో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్లను కలిపి)లో 61 మ్యాచ్ లను ఆడింది.


ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఒక జట్టు ఆడిన అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఇవే.

అయితే తాజాగా టీమిండియా ఈ రికార్డును బద్దలు కొట్టింది.


న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 2022లో భారత్ కు 62వ అంతర్జాతీయ మ్యాచ్.

దాంతో 13 ఏళ్లుగా చెక్కు చెదరకుండా వస్తోన్న ఆస్ట్రేలియా అత్యధిక మ్యాచ్ ల రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

ఇక ఈ ఏడాది భారత్ న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, టెస్టు సిరీస్ లు ఆడాల్సి ఉంది. 


దాంతో 2022లో భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచ్ ల సంఖ్య 71కి చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి