టి20 ప్రపంచపక్ కోసం భారత జట్టు గురువారం తెల్లవారు జామున ఆస్ట్రేలియాకు బయలుదేరింది.
14 మంది జట్టు సభ్యులతో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా ఆస్ట్రేలియాకు పయనమైంది.
బుమ్రా స్థానంలో ఇంకా ఎవర్నీ ఎంపిక చేయకపోవడంతో భారత్ 14 మందితోనే ఆసీస్ కు వెళ్లింది.
బ్రిస్బేన్ లో ఏర్పాటు చేసిన ట్రయినింగ్ క్యాంప్ లో భారత్ వారం రోజుల పాటు శ్రమించనుంది.
ఆ తర్వాత అక్టోబర్ 17 (ఆస్ట్రేలియా), 19 (న్యూజిలాండ్)వ తేదీల్లో రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడనుంది.
టి20 ప్రపంచకప్ లో భారత్ ఒక ప్లేయర్ పై అధికంగా ఆధారపడనుంది.
ఒకరకంగా చెప్పాలంటే అతడు భారత్ కు బ్రహ్మాస్త్రంలా వ్యవహరించే అవకాశం ఉంది.
ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు.
ఇప్పటికే భారత్ తరఫున ఒక ఏడాదిలో అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.
మిడిల్ ఓవర్స్ లో ప్రత్యర్థుల బౌలింగ్ ను చీల్చి చెండాటంలో సూర్యకుమార్ యాదవ్ కు తిరుగు లేదు.