సూర్య భాయ్..
 రికార్డుల రారాజు

telugu.news18.com

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

బరిలోకి దిగాడంటే భారీ స్కోరు ఖాయం అన్నట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నాడు

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో కదం తొక్కాడు.


51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అజేయ శతకం సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం.

ఇక ఈ మ్యాచ్ లో భారత్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సూపర్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

2022లో సూర్యకుమార్ యాదవ్ కు ఇది 7వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం.

ఈ క్రమంలో కోహ్లీ రికార్డును సూర్యకుమార్ బద్దలు కొట్టాడు.

2016లో కోహ్లీ 6 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. నిన్నటి వరకు ఒక ఏడాదిలో భారత ప్లేయర్ అందుకున్న అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డు కోహ్లీ పేరిటే ఉంది.

తాజాగా ఈ రికార్డును సూర్యకుమార్ బద్దలు కొట్టాడు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి