77 పరుగులు మాత్రమే.. SKY సాధిస్తాడా మరీ?

telugu.news18.com

టి20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్నాడు. ఫామ్ ఆఫ్ ఈజ్ లైఫ్ అని పేర్కొనవచ్చు.

ఆ ఏడాది ఇంగ్లండ్ తో జరిగిన మూడో టి20లో సెంచరీ కూడా బాదాడు.

ఇక తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టి20లో 46 పరుగులు చేసి తన ఫామ్ ను చాటాడు.


తాజాగా సూర్యకుమార్ యాదవ్ ఒక అరుదైన రికార్డుకు చేరువగా ఉన్నాడు.

అందుకు కేవలం 77 పరుగుల దూరంలో నిలిచాడు.

2022లో అంతర్జాతీయ టి20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 613 పరుగులు చేశాడు.

ఒక ఏడాదిలో అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచేందుకు స్కై చేరువగా వచ్చాడు.

2018లో శిఖర్ ధావన్ అంతర్జాతీయ టి20ల్లో 689 పరుగులు చేశాడు. ఒక ఏడాది టి20ల్లో భారత ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే.

మరో 77 పరుగులు చేస్తే సూర్యకుమార్ యాదవ్ ధావన్ రికార్డును అధిగమిస్తాడు.

ఆసీస్, సఫారీ జట్లతో పాటు ఈ ఏడాది టి20 ప్రపంచకప్ కూడా భారత్ ఆడనుంది. దాంతో గబ్బర్ రికార్డు బ్రేక్ కావడం ఖాయం.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి