సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా (Team India) అభిమానులు కలవరిస్తున్న పేరు ఇదే.
30 ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. టీ20ల్లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు.
టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టినా సూర్య.. మరోసారి తన జోరు చూపించాడు.
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సునామీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు.
సూర్యకుమార్ యాదవ్ ( 51 బంతుల్లో 112 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) సూపర్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ మ్యాచులో సూర్యకుమార్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఫలితంగా భారత్ తరపున అత్యంత వేగంగా టీ20 సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
అంతకుముందు రోహిత్ శర్మ ఇండోర్‌లో ఇదే శ్రీలంకపై 35 బంతుల్లోనే శతకం బాదాడు.
ఇక.. ఈ ఏడాది టీ20 ఫార్మాట్ లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా సూర్య రికార్డు సృష్టించాడు.
ఇక.. టీ20ల్లో రోహిత్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ రికార్డులెక్కాడు.
రోహిత్ నాలుగు సెంచరీలు చేస్తే.. సూర్య ఇప్పటికే మూడు సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక.. టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన నాన్ - ఓపెనర్ సూర్యనే.