ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..

telugu.news18.com

సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా అభిమానులు కలవరిస్తున్న పేరు ఇదే. 

టీ20 ఫార్మాట్ లో టీమిండియాకు వెన్నెముకలా మారిపోయాడు.


పిచ్ తో సంబంధం లేకుండా తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

మిడిల్ ఓవర్లలో 200కు పైగా స్ట్రయిక్ రేట్ తో పరుగులు సాధించడం సూర్యకుమార్ ప్రత్యేకత.

 ఇప్పుడు లేటెస్ట్ గా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 ర్యాంకింగ్స్ లో 900 పాయింట్లు సాధించిన తొలి భారతీయుడిగా సూర్యకుమార్ నిలిచాడు.

ప్రస్తుతం సూర్య 908 రేటింగ్ పాయింట్స్ తో ఐసీసీ నెం.1 బ్యాటర్ గా నిలిచాడు. 

తర్వాతి స్థానాల్లో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచాడు.

ఇక.. సూర్య కంటే ముందు డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్ మాత్రమే టీ20 క్రికెట్ చరిత్రలో 900 పాయింట్లు దాటారు.

ఇప్పుడు సూర్య ఈ రికార్డు సాధించి మూడో ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి