ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) టీమిండియా జట్టులో ఓ సంచలనం.
జమ్మూ కశ్మీర్ కు చెందిన ఈ యువ పేసర్ ఇప్పుడు భారత జట్టు తరఫున ఆడుతున్నాడు.
బంతిని 150 కి.మీ వేగంతో వేయగల సత్తా ఇతడి సొంతం.
మ్యాచ్ కు ఒకటో రెండో బంతులు వేగంగా వేసి అనంతరం తక్కువ వేగంతో వేయడం ఉమ్రాన్ మాలిక్ కు అసలు తెలియదు.
తాజాగా ఈ పేస్ గుర్రం అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్(3/57) మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు.
ఈ మ్యాచులో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
తాను వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 14వ ఓవర్) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు.
ఈ ఓవర్‌లో వరుసగా గంటకు 147, 151, 156, 146, 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు.
ఈ సిరీస్‌కు ముందు లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.