లేడీ గంగూలీ జోరు.. ర్యాంకింగ్స్​లో తగ్గేదే లే..

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉంది.

ఇంగ్లాండ్ పర్యటనలో ఈ లేడీ గంగూలీ బ్యాటింగ్​లో దుమ్మురేపుతుంది. 

లేటెస్ట్ గా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లోనూ ఆమె దూసుకెళ్లింది. 

కెరీర్ అత్యుత్తమ ర్యాంకింగ్​ను అందుకుంది. టీ20ల్లో రెండో స్థానానికి చేరుకుంది స్మృతి. 

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 111 పరుగులు చేసిన తర్వాత ఈ ఘనత సాధించింది. 

ఇంగ్లాండ్​తో జరిగిన వన్డే సిరీస్‌లోని మొదటి వన్డే మ్యాచ్‌లో 91పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. 

దీంతో వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుంది.

ఇక, స్మృతి మంధానను భవిష్యత్తు టీమిండియా కెప్టెన్ గా భావిస్తున్నారు.

తన ఆటతోనే కాకుండా అందంతోనూ నేషనల్ క్రష్ గా మారింది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి