కివీస్ తో జరిగిన ఫస్ట్ వన్డేలో డబుల్ సెంచరీతో వారెవ్వా అనిపించాడు యంగ్ గన్ శుభ్‌మాన్ గిల్.
గిల్ 149 బంతులలో 9 భారీ సిక్సర్లు, 19 ఫోర్లతో మొత్తం 208 పరుగులు చేశాడు.
దీంతో.. పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఓ అరుదైన రికార్డుతో వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచాడు.
ఫస్ట్ వన్డేలో గిల్ 1000 పరుగుల మైలు రాయి అందుకున్నాడు.
దీంతో.. వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యయాన్ని లిఖించాడు.
వన్డే చరిత్రలో 60+ యావరేజ్.. 100+ స్ట్రైక్ రేట్ తో.. 1000+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
అంతేకాకుండా.. వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు.
కేవలం 23 ఏళ్ల 132 రోజుల వయసులో ఈ అద్భుతాన్ని చేశాడు.
గత నెలలో 24 ఏళ్ల 145 రోజుల వయసులో ఈ రికార్డును నెలకొల్పిన ఇషాన్ కిషన్ రికార్డును బద్దలు కొట్టాడు.