క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారాల కూతురు సారా టెండూల్కర్ ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో సంచలనం.
తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
ఇన్ స్టాగ్రామ్ లో సారా టెండూల్కర్ కు 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం.
తన క్యూట్ లుక్స్ తో ఈ అమ్మడు కుర్రకారు మతిని పోగుడుతుంది.
హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందం సారాది.
ప్రస్తుతం సారా టెండూల్కర్ లండన్ లో మెడిసిన్ చేస్తుంది.
సెలవుల్లో ఫ్రెండ్స్ తో కలిసి విహార యాత్రలను చేస్తుంది.
వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది.
సారా టెండూల్కర్ నటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని గతంలో వార్తలు కూడా వచ్చాయి.