ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 31న ఆరంభం కానుంది.
మే 28న జరిగే ఫైనల్ తో ధనాధన్ లీగ్ 16వ సీజన్ ముగియనుంది.
ఈసారి మొత్తం 12 వేదికలపై ఐపీఎల్ జరగనుంది.
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ భారీ రికార్డుపై కన్నేశాడు.
ఐపీఎల్ లో 6 వేల పరుగుల మైలురాయికి రోహిత్ ఎంతో దూరంలో లేడు.
కేవలం 121 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు.
227 మ్యాచ్ ల్లో 30.30 సగటుతో రోహిత్ శర్మ 5,879 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 16వ సీజన్ లో రోహిత్ మరో 121 పరుగులు చేస్తే 6 వేల మైలు రాయిని అందుకున్న మూడో భారత ప్లేయర్ గా నిలుస్తాడు.
రోహిత్ కంటే ముందు ఈ మైలురాయిని విరాట్ కోహ్లీ (6,411), శిఖర్ ధావన్ (6,086) అందుకున్నారు.
రోహిత్ తన ఐపీఎల్ కెరీర్ లో ఒక సెంచరీతో పాటు 40 అర్ధ సెంచరీలు సాధించాడు.