ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ
లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది.
ఈ క్రమంలో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది.
ఛేజింగ్ లో కేఎల్ రాహుల్ 64 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో పాటు ఆఖర్లో బ్యాట్ తోనూ మెరిసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
ఇక ఈ మ్యాచ్ ను గెలవడం ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు.
టీమిండియా తరఫున అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 15వ విజయం. ఇప్పటి వరకు 20 వన్డేల్లో రోహిత్ నాయకుడిగా ఉండగా అందులో భారత్ 15 మ్యాచ్ ల్లో నెగ్గింది.
ఈ క్రమంలో సునీల్ గావస్కర్ పేరిట ఉన్న 14 మ్యాచ్ ల రికార్డును రోహిత్ అధిగమించాడు.
రోహిత్ తర్వాతి టార్గెట్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ కెప్టెన్సీలో భారత్ 23 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.
రోహిత్ కెప్టెన్సీలో భారత్ మరో 9 వన్డేల్లో గెలిస్తే సచిన్ రికార్డును కూడా అధిగమిస్తాడు.
భారత్ ను అత్యధిక వన్డేల్లో గెలిపించిన కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని (110 వన్డేలు) ఉన్నాడు. 200 మ్యాచ్ లకు ధోని కెప్టెన్ గా ఉంటే అందులో భారత్ 110 సార్లు గెలిచింది.