మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెరదించాడు.
2019 జనవరిలో వన్డేల్లో చివరిసారిగా శతకం బాదిన రోహిత్.. మూడేళ్ల తర్వాత మరో శతకం బాదాడు.
కివీస్ తో ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ సూపర్ సెంచరీతో మెరిశాడు.
వన్డేల్లో ఇది రోహిత్ కు 30వ సెంచరీ.
ఈ మ్యాచ్ లో రోహిత్ 6 సిక్సర్లతో పాటు 9 ఫోర్లు బాదాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.
శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (270 సిక్సర్ల)ను రోహిత్ దాటేశాడు.
241 వన్డేల్లో 273 సిక్సర్లు రోహిత్ బాదాడు. ఈ క్రమంలో భారత్ నుంచి అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా ఉన్నాడు.
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహీద్ అఫ్రిది ఉన్నాడు. అతడు 351 సిక్సర్లు బాదాడు.
రెండో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతడు 331 సిక్సర్లు బాదాడు.