టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా మహాసమరానికి తెరలేవనుంది.
ఇక, సొంత గడ్డ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది.
అయితే, ఇండోర్ లో జరిగిన సిరీస్ లోని ఆఖరి టీ20 మ్యాచులో సఫారీ జట్టు చేతిలో టీమిండియా భారీ ఓటమిని మూటగట్టుకుంది.
ఇండోర్ వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియాపై దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో నెగ్గింది.
ఇక, ఈ మ్యాచులో రోహిత్ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు.
ఈ ఔట్ తో రోహిత్ శర్మ తన కెరీర్ లో అతి చెత్త రికార్డు నమోదు చేశాడు.
పురుషుల పొట్టి క్రికెట్ లో హిట్ మ్యాన్ 43వ సారి కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయి వరస్ట్ రికార్డ్ నెలకొల్పాడు.
టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయిన ప్లేయర్‌గా చరిత్ర నెలకొల్పాడు.
అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్ (42) పేరిట ఉంది.
ఇక, తొలి టీ20లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, కెరీర్లో చెత్త రికార్డును నెలకొల్పాడు.
ఈ ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచులో డకౌట్ అయిన రోహిత్ శర్మ, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో రెండు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు.
ఒకే ఏడాది టీ20ల్లో మూడు సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రోహిత్ శర్మ.