ఒకే ఒక్కడు

telugu.news18.com

మరోసారి మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీ చతురతను చూపాడు.

గత సీజన్ లో నిరాశ పరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ను ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేర్చాడు.

ఏ కెప్టెన్ సాధించలేని అరుదైన రికార్డును ధోని సాధించాడు.


తన కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 11వ సారి ప్లే ఆఫ్స్ కు చేర్చాడు.

ఇందులో చెన్నైని నాలుగు సార్లు చాంపియన్ గా కూడా నిలిపాడు. మరో 5 సార్లు చెన్నై రన్నరప్ గా నిలిచింది.

2008 నుంచి 2019 వరకు వరుసగా 10 సీజన్లలో చెన్నైని ధోని ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. (2016, 2017 సీజన్లలో చెన్నై బరిలోకి దిగలేదు)

ఈ రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం.

మే 23న జరిగే క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

ఈ మ్యాచ్ చెపాక్ వేదికగా జరగనుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి