క్రికెట్ చరిత్రలో..
వన్ అండ్ ఓన్లీ

telugu.news18.com

గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

2022 ఐపీఎల్ ముందు వరకు కూడా కుల్దీప్ కెరీర్ ముగిసందనే అంతా అనుకున్నారు.


అయితే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోవడంతో కుల్దీప్ రాత మారింది.

మొదట ఐపీఎల్ లో అదరగొట్టిన అతడు.. ఆ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేశాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో అదరగొడుతున్నాడు.

తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

ఈ క్రమంలో కుల్దీప్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్లను కలిపి)లో 200 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ గా నిలిచాడు.

కుల్దీప్ ముందు వరకు ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్లు 200 అంతర్జాతీయ వికెట్లను తీయలేకపోయారు.

ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ 180 వికెట్లు తీశాడు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి