సామీ..
నీ క్రేజ్ ఎవరెస్ట్..!

telugu.news18.com

క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ (Virat Kohli). 

టీమిండియా పరుగుల మెషిన్, కింగ్ కోహ్లీ, రికార్డుల వీరుడు, చేజింగ్ మాస్టర్ ఇలా కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ముద్దుగా పెట్టుకున్న పేర్లు. 

ఇక, విరాట్ కోహ్లీ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందే తప్పా ఇసుమంత కూడా తగ్గడం లేదు. 

కెప్టెన్సీ పోయినా.. కొన్నాళ్లు సరిగ్గా ఆడకపోయినా.. అతన్ని క్రేజ్ మాత్రం రెండింతలు అయ్యింది. 

ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అత్యంత ఆదరణ కలిగిన ఏకైక క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. 

ఇన్‌స్టా, ట్విటర్ వేదికగా అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న క్రికెటర్ కూడా కోహ్లీనే. 

ఆసియాకప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత మెగాటోర్నీలో కూడా రెచ్చిపోయాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2022లోనూ 6 మ్యాచ్‌ల్లో 296 పరుగులు చేసి టోర్నీకే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఇక, లేటెస్ట్ గా కింగ్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. 

పరుగుల వరదపారించే కోహ్లీ.. పాపులారిటీలోనూ నంబర్‌ వన్‌గా నిలిచాడు. 

ఇండియాలో అక్టోబర్‌ నెలకు గాను.. మోస్ట్‌ పాపులర్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌గా ఎంపికయ్యాడు. 

టాప్‌ 10లో విరాట్‌ కోహ్లీకే అగ్రస్థానం దక్కింది. 

ఇక, రిటైర్‌ అయి ఆటకు దూరంగా ఉన్న ధోని రెండో స్థానంలో నిలవడం విశేషం. 

ఇక ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోహ్లీ, ధోనిల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి