రోహిత్ మిస్ ఫైర్.. 

telugu.news18.com

అంతర్జాత్తీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ ఉన్నాడు.

ఇప్పటి వరకు 137 మ్యాచ్ ల్లో 3,631 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక సెంచరీల రికార్డు కూడా హిట్ మ్యాన్ దే.

అయితే రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.


ముఖ్యంగా 2021 ప్రపంచకప్ అనంతరం రోహిత్ పరుగుల ప్రవాహం తగ్గింది.

ఈ ఏడాది రోహిత్ 18 అంతర్జాతీయ టి20ల్లో కేవలం 434 పరుగులు మాత్రమే చేశాడు.

సగటు 25. ఇది అతడి ఓవరాల్ యావరేజ్ (32) కంటే కూడా తక్కువ. ఈ ఏడాది టి20ల్లో రోహిత్ కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు.

రోహిత్ ఫామ్ కు అతడి కొత్త బ్యాటింగ్ స్టయిలే కారణమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇంతకుముందు రోహిత్ నెమ్మదిగా తన బ్యాటింగ్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత భారీ షాట్లకు వెళ్లేవాడు. 

కానీ, 2022 నుంచి తొలి బంతి నుంచే భారీ షాట్లకు వెళ్తున్నాడు. ఈ ఏడాది రోహిత్ తక్కువ పరుగులే చేసినా స్ట్రయిక్ రేట్ మాత్రం 142.76గా ఉంది. 

ఇదే విషయాన్ని సునీల్ గావస్కర్ కూడా పేర్కొన్నాడు.

తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడాలనే ప్రయత్నంలో రోహిత్ తన వికెట్ ను పారేసుకుంటున్నాడని పేర్కొన్నాడు.

క్రీజులో కుదురుకున్నాక రోహిత్ చెలరేగితే మంచిదనే అభిప్రాయన్ని గావస్కర్ వ్యక్తం చేశాడు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి