కోహ్లీ vs గిల్

telugu.news18.com

ఇండియన్ క్రికెట్ లో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఒకరేమో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొడుతుంతే.. ఇంకొకరు వాటిని అధిగమించే పని పెట్టుకున్నారు.

ఈ ఏడాది ఇరువురు ప్లేయర్లు పోటీ పడి మరీ పరుగులు సాధిస్తున్నారు.



ఐపీఎల్ 2023 సీజన్ లోనూ వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధిస్తున్నారు.

ఈ ఏడాది వీరిద్దరి గణాంకాలను తీసుకుంటే..

ఐపీఎల్ లో కోహ్లీ 14 మ్యాచ్ ల్లో 639 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు.. 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 53.25.

గిల్ విషయానికి వస్తే 14 మ్యాచ్ ల్లో 680 పరుగులు చేశాడు. ఇందులోనూ 2 సెంచరీలు ఉండటం విశేషం. 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 56.67.

ఇక వన్డేల్లో 9 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. 427 పరుగులు చేశాడు. గిల్ విషయానికి వస్తే 9 మ్యాచ్ ల్లో 624 పరుగులు చేశాడు.

ఇక టెస్టుల్లో కోహ్లీ 4 మ్యాచ్ ల్లో 297 పరుగులు చేశాడు. గిల్ 2 మ్యాచ్ ల్లో 154 పరుగులు చేశాడు.

ఈ ఏడాది కోహ్లీ అంతర్జాతీయ టి20లు ఆడలేదు. గిల్ విషయానికి వస్తే 6 టి20 మ్యాచ్ ల్లో 202 పరుగులు చేశాడు.

ఓవరాల్ (ఐపీఎల్ ను కలుపుకొని) గా ఇప్పటి వరకు కోహ్లీ 27 మ్యాచ్ ల్లో 1,417 పరుగులు చేశాడు. 5 సెంచరీలు.. 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 52.48.

గిల్ విషయానికి వస్తే 31 మ్యాచ్ ల్లో 1,660 పరుగులు చేశాడు. 7 సెంచరీలు.. 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 53.54.

పరుగుల కోసం పోటీ పడుతున్న వీరిద్దరు ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లోనూ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే టీమిండియా వన్డే ఫార్మాట్ లో మూడోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయం.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి