రింకూ సింగ్.. ప్రస్తుతం క్రికెట్ లో ఇతడో సంచలనం.
గతేడాది ఐపీఎల్ లో అదరగొట్టిన రింకూ సింగ్.. ఈ ఏడాది మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు.
ఇక తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులోనూ రింకూ సింగ్ మెరిశాడు.
రింకూ సింగ్ వీర బాదుడికి ఒక దశలో లక్నో గెలుపుపై ఆశలను వదిలేసుకుంది.
టార్గెట్ ఎంత పెద్దదైనా.. ఏ మాత్రం బెదరకుండా బ్యాటింగ్ చేయడం రింకూ స్పెషాలిటి.
రింకూ సింగ్ ను టీమిండియాకు ఎంపిక చేయాలని మాజీ క్రికెట్లరు డిమాండ్ చేస్తున్నారు.
ఇక అభిమానులు అయితే మరో ధోని అంటూ రింకూ సింగ్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు.
రింకూ సింగ్ త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉంది.