టీమిండియా యువ మహిళల జట్టు చరిత్ర లిఖించింది.
మహిళల విభాగంలో అందని ద్రాక్షలా ఉన్న క్రికెట్ ప్రపంచకప్ ను సాధించి దేశం గర్వపడేలా చేసింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న తొలి మహిళల టి20 ప్రపంచకప్ లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
షఫాలీ వర్మ నాయకత్వంలోని టీమిండియా ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై నెగ్గి ప్రపంచ చాంపియన్ గా అవతరించింది.
ఫైనల్లో భారత బౌలర్లు ఇంగ్లండ్ ను కేవలం 68 పరుగలకే ఆలౌట్ చేశారు.
అనంతరం భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచింది.
ఫైనల్లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సత్తా చాటింది. టైటిల్ పోరులో సమయోచితంగా ఆడిన త్రిష 3 ఫోర్లతో 24 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది.
అండర్ 19 ప్రపంచకప్ ను నెగ్గిన మన అమ్మాయిలను దేశ మొత్తం ప్రశంసిస్తోంది.
భారత్ కు అండర్ 19 ప్రపంచకప్ అందించిన షఫాలీ వర్మ.. ఫిబ్రవరిలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ లోనూ భారత్ ను గెలిపించేందుకు సిద్ధమైంది.
మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి10 నుంచి సౌతాఫ్రికా వేదికగానే ఆరంభం కానుంది.